# భార్యా బాధితులైన గురుశిష్యులు
గురువు తన భార్యను అదుపులో పెట్టుకోకపోవడం చూచి ఒక శిష్యుడు ఆ గురువుని ఆక్షేపిస్తాడు. అదే కాక భార్యని ఎలా అదుపులో పెట్టుకొవాలో తన పెళ్ళయ్యాక చూపిస్తా అని నోరు జారుతాడు. కొంత కాలానికి ఆ శిషుడి పెళ్లి అవుతుంది. ఒక సందర్భంలో తన ఇంటికి వచ్చిన గురువుకి తను చేసిన శపథం గుర్తుకొచ్చి భార్యతో గురువు ఉన్నంత సేపు మర్యాద ఇవ్వమని, తాను ఏమన్నా భరించమని వేడుకుంటాడు. కాని వడ్డిస్తున్న సమయంలో సహజంగా గయ్యాళి స్వభావి అయిన భార్య భర్త అంటున్న మాటలకు ఓపిక నశించి భర్త నెత్తి మీద తను వడ్డిస్తున్న కుండతో కొట్టి, కుండ ముక్కలైనందుకు డబ్బులు కూడా ఇమ్మంటుంది. అది చూసిన గురువుకి అంతా అవగతమై ఈ సమయంలో తన భార్య కాని కనపడితే దణ్ణం పెడతా అని కింది పద్యం చెపుతాడు
అనేక శత భాండాని పిన్నాని మామ మస్తకే
మహోభాగ్యవతీ నారీ భాండమునిమ్నయాచతే
# జరుక్ శాస్త్రి విశ్వనాథుల వారికి పెట్టిన పేరు భాషానపాకప్రభో
కించిక్తిక్త కషాయభాడబరసక్షేపాతిరేఖాతి వాక్సంచార
ప్రచయావకాశాములతో కవ్యుత్కగండాశ్వముల్ సెంచెల్లీల
రహించి పల్కినగతిన్ సాధించి వేధించుమా పంచారించి
ప్రవళ్ళికావృతికృతిన్ భాషాన పాకప్రభో
#విశ్వనాథుల వారి రామ సంభోధన
క్షోణిబర వారణావతారనాలీలాకృతి
# ఛలోక్తి
ఎక్కడ ఆగని బస్సును నాన్ స్టాప్ బస్సు అంటే ప్రతి చోట ఆగే బస్సును నానాస్టాప్ బస్సు అనొచ్చు

No comments:
Post a Comment