Sunday, July 26, 2015

సాహిత్యంలో హాస్యం - 234

# బ్రతికి చెడుట 
మన పరిస్థితి దిగజారి పోయినప్పుడు మనం మన స్థాయికి తగని పనులు చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో మనం స్వతాహాగా పడే బాధ కంటే ఎదుటి వారి పరామర్శ వాళ్ళ కలిగే  బాదే ఎక్కువ.

ఒకసారి ఒక పండితుడు తన స్థాయికి తగని పనిని చేయాల్సి వొచ్చింది. అది ఏంటంటే రాజు గారి పల్లకి మోయడం. తనకి అలవాటు లేని పని అవడంతో ఆ పండితుడు పల్లకి మోయడంలో ఇబ్బంది పడుతున్నాడు. అది గమనించిన రాజు జాలి పడి ఇలా అన్నాడు
                 ఆయమాందోళికా దండక
                 కక్షక్కిం తవ భాదతి 

అది వినిన ఆ పండితుడు బదులుగా
                నాయమాందోళికా దండక
                తవ భాదతి భాదతే

రాజు తప్పుగా వాడిన భాదతి అనే శబ్దం భాదించినంతగా ఈ పల్లకి ఎం భాదించడం లేదని తన ఆవేదన.

ఆందోళికా దండ - పల్లకీ కొయ్య
ఆందోళన - ఊగడం

# నానాటికి తీసికట్టు నాగంబట్టు 

                  ఏ నాటి అగ్రహారము మీనాటికి
                 కండ్రిగాయే మీ పని దీరెన్
                 మానాడు మాన్యమయ్యెను
                 నానాటికి తీసికట్టు నాగంబట్టు 

పౌరుడు - అగ్రహారం
కండ్రిగ - 100 ఎకరాలు
మాన్యం - ~ 10 నుండి 25 ఎకరాలు
భోగం - ఉత్సవం

# నవ్వు నాలుగు విధాల చేటు మరి ఏడుపో?

ఏడుపు ఏడూ విధాల మెలత
1. కళ్ళలోని క్రిములు బయటికొస్తాయి
2. హృదయభారం తేలికవుతుంది
3. ఏడ్చేవారికి గుండె నొప్పి ఉండదు (ఆడవాళ్ళకు అందుకే రాదు)
4. కళ్ళ నొప్పులు తగ్గుతాయి
5.  కళ్ళలోని 37 రకాల కండరాలు బలపడుతాయి
6. మగ, ఆడ వాళ్ళలో హార్మోన్లు ఏడుపు వల్ల పెరుగుతాయి
7. ఏడ్పు నటించడం వల్ల చాల పనులు జరుగుతాయి 












Saturday, July 25, 2015

సాహిత్యంలో హాస్యం - 233

# ప్రార్థనా శ్లోకం
           మండుటెండలోన మర్రి నీడనుబోలి అభయహస్తమొకటి శుభము జూపు
           అదియె లేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు

# మేకపోతు గాంభీర్యం

మనకి ఎపుడైనా మనకంటే బలవంతులైన వారిచే ఆపద ఏర్పడ్డప్పుడు తెలివితేటలతో, మాటలతో తప్పించుకొనవచ్చును. దానికి ఒక జాతీయమే మేకపోతు గాంభీర్యం.

ఒకసారి ఒక మేకపోతు దారి తప్పి అడవిలోకి వెళ్ళిందట. భయపడుతూ ఉన్న ఆ మేకపోతుకి ఒక సింహం ఎదురైంది. అసలే భయపడుతూ ఉన్న ఆ మేకకి ఇక తను చావక తప్పదు అనిపించింది. కాని చనిపోయేముందు ఈ సింహం భారి నుండి తప్పించుకోడానికి తన వంతు ప్రయత్నం చేద్దాం అనుకుంది.  మేకపోతుని ఎప్పుడూ చూడని సింహం, ఆ మేకపోతుకి ఉన్న గడ్డాన్ని చూసి ఇలా ప్రశ్నించింది.
       "ఏంటి ఎవరు నీవు? వింతగా గడ్డం అలా పెంచావు. నా జూలు చూసావా ఎలా ఉందో". అప్పుడు ఒక మెరుపు లాంటి ఆలోచన ఆ మేకకు తట్టి ఇలా పలికింది -
                      "అహమేక శతం వ్యాఘ్రాం
                      పంచవింశతి కుంజరాన్
                      ఏక సింహంన భక్ష్యామి
                      గడ్డంతేన విముచ్యతే"

ఇప్పటి వరకు వంద పులులను చంపాను. ఇరువది అయిదు ఏనుగులను తిన్నాను. ఒక్క సింహాన్నైన తిననిదే ఈ గడ్డం తీయనని  ప్రతిజ్న చేసాను.  అది వినిన సింహం భయపడి పరుగో పరుగు. అద్గదీ మేకపోతు గాంభీర్యం అంటే.


- తెలివి తేటలు మనల్ని కాపాడుకోడానికి, పరులను రక్షించడానికి ఉపయోగించాలి కాని మోసం చేయడానికి కాదు
- తెలివి తేటలు పర భాషలోనే చదువుతే వస్తాయని కాదు. మాతృభాషలో అభ్యసించినా వస్తాయి. 30 ఏళ్లుగా ప్రభావితం చేస్తున్న ఆంగ్ల భాష డబ్బులు, ఉద్యోగాలు, భోగాలను ప్రోత్సహిస్తుంది.

# సూక్ష్మ దృష్టి - బొంగరం మీద (వెంకట పార్వతీశ్వరులు)
                 రింగు రింగున తిరుగునీ బొంగరంబు
                 ఏమి వ్రాయుచునున్నది ఈ ఇసుకలోన
                 బడికి పోలేదు పుత్తంబు పట్టలేదు
                 ఎట్లు వచ్చినదో దీనికింత చదువు


కవిత్వమనేది వస్తువులో ఉండదు. చూసేవాడి దృష్టిలో ఉంటుంది. కవిత్వానికి కావాల్సింది క్రాంత దర్శన. అదే సూక్ష్మ దృష్టి.

- పట్టుకోవాలని సీతాకోక చిలుక వెంబడి పడితే అది దొరకదు. అదే నువ్వు రాయిల కదలకుండా ఉండు. అదే నీ మీద వాలుతుంది. సుఖాలు కూడా అంతే. మనం వెంట పడితే పరుగెడతాయి. అదే ఏమి చేయకుంటే మన దగ్గరికే వస్తాయి 













                

Thursday, July 16, 2015

నవ జీవన వేదం - 352 (15 జూలై 2015)

# ప్రార్ధనా శ్లోకం
నను మన్నింపవు నాకు కన్పడవుగా నా పద్య నైవేద్యముల్
నిను త్రుప్తింబడజేయవకటా నీ దివ్యతేజంబు గన్గోనగా నేను
తపస్వినా కవిత నీకున్ లోకువా ఇంతకంటే ప్రేమించెటి వారె
లెవ్వారె భవానీ నాకు చూపింపుమా

# సనాతన ధర్మం
ఎప్పుడూ నిలబడి ఉండే ధర్మాన్ని సనాతనం అంటారు. ఎప్పుడూ ఏది నిలబడుతుంది. కాలానికి అనుగుణంగా మార గలిగితే నిలబడుతుంది.

# గోదావరి పుష్కరాలు - దాంపత్యం
(ఆచార్య వేతవూరు రామబ్రహ్మం)

                            ఈ వేమో మొగుడోయటందువు అతడు అబ్దీశానుడు
                            అర్ధాంగిరో రా రమ్మంచు తపించు ఇమ్మహిన్ భార్యాభర్త్రు
                            బంధంబు విద్యావిజ్ఞాన నిదానులందున కటా వ్యాపార
                            మైపోయి లక్ష్మీ వజ్రాహతి రాగవల్లికలు చచ్చించూవె గోదావరి

- పురాణాలు ప్రలోభ పెడతాయి. వేదాలు అజ్ఞాపిస్తాయి. కాని కావ్యం ధర్మాన్ని మన మనస్సుకి ఇష్టం అయ్యేలా చేస్తుంది.

- అవమాన సన్మానాలు పట్టించుకోని అవధూత - గోదావరి




సాహిత్యంలో హాస్యం - 232

# యూనిఫారం
ఒకప్పుడు ధనవంతులు, బీదవాళ్ళ పిల్లలు ఒకే స్కూల్లో చదువుకునే వారు. ఏవిదమైన బేధ భావాలు కలగకూడదని  యూనిఫారం నియమం పెట్టడంలో అర్ధం ఉంది. కాని ఇప్పుడు ధనవంతుల పిల్లలు టెక్నో స్కూల్స్ లోను, బీదవాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు . బేధ భావాలు కలిగే ప్రసక్తియే లేదు. ఇక యూనిఫారం ఎందుకు?

# ఒక స్త్రీ తెగింపు

ఒక స్త్రీ అర్దరాత్రి అమావాస్య, ముల్లు  గొంకలు పట్టించుకోకుండా నల్ల బట్టలేసుకొని అందంగా అలంకరించుకొని వెళ్ళిపోతుందట. అది చూసి ఒకరు
                                     క ప్రస్థితాసి కరబోరు ఘనే నిషీదే (చిమ్మ చీకటి)
                                     ఏకాకిని వద కదంన బిభీషిపాలె
ఏంటమ్మా? అర్ధరాత్రి ఇలాగ చిమ్మ చీకటి, దారి తెన్ను చూడకుండా ఎవరు తోడు లేకుండా వెళుతున్నావు అని ఇలా అడిగాడు

దానికి బదులుగా, ఆ స్త్రీ
                                 ప్రాణాధికో వసతియత్ర మన:ప్రియోమే 
                                 నన్వస్తీ పుంకిత శరో మదనస్సహాయక:

నా కంటే నాకు ఎక్కువైన నా ప్రియుని దగ్గరికి వెళ్తున్నాను. నా వెంబడి బాణాలు ఎక్కుపెట్టి మన్మధుడు నా వెంట వస్తున్నాడు.

- ప్రేమించిన వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమని గురించి కూడా ఆలోచిస్తారు. అదే కామించిన వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమ కనపడదు
- మనస్సును మదించే ఒక పిచ్చి కోరికకు మన్మధుడు అని పేరు. వాడికి శరీరం లేదు.
- శివుడు మన్మదున్ని దహించాడంటే జ్ఞాననేత్రంతో కామాన్ని జయించాడు. జ్ఞానం కలిగితే కామం నశిస్తుంది

# సామెత 
                      చేసేది జపం వేసేది గాలం (మోసం చేయడం అనే సందర్భంలో వాడుతారు)

తార్కికత లేని ఆస్తికత మూర్ఖత్వం అయిపోతుంది. తార్కికత మీదే ఆదారపడిన ఆస్తికత కూడా మూర్ఖత్వమే

చేసేను జపమతుడు కాదు విశ్వాసము చెలి చూపు బేడిసలమై నిగుడున్
చేసెదిడియు జపమన్ మరియు వేసెడిదుయు  గాలమనుత వృధగాకుండన్


















Sunday, July 5, 2015

నవ జీవన వేదం - 319 (28 మే 2015)

# దేనిని ఎలా ఎదుర్కోవాలి
- సుందరకాండ
సాగర స్యోర్మి జాలానామురసా శైల వర్ష్మణాం
అభిఘ్నంస్తు మహావేగ: పుప్లువేస మహా కపి:

-
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజింతురు ఉర్విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
 ప్రారాబ్దార్ధములుజ్జగింపరు గదా ప్రజ్ఞానిధుల్ గావుచున్

- మొదకస్తాడయా
మ- వద్దు; ఉదక- నీరు ; మోదక - లడ్డు
- షణ్ముఖుడు - కుమారస్వామి - సకల శాస్త్రాధిపతి

# తిక్కన్న - విరాట పర్వం - ఉత్తర గోగ్రహణం
- మాటలు కోటలు దాటుతాయి చేతలు గడపలు దాటవు
- మన భావనను బట్టే ప్రపంచం. మనం భయపడితే భయపెడుతుంది. తేలికగా తీసుకుంటే తేలిగ్గానే కనపడుతుంది.
- కౌరవ సైన్యం చూసిన అర్జునిని ఆత్మ విశ్వాసం
ఇది యొక పెద్ద గట్టిమొన ఈ మొనముందట గో గణంబుతో
అది యొక అల్ప సైన్యం ఆతల వేరొక కొంత సేన అల్లది ఇటు
పంచి పెట్టజని అన్నిటిలోన వృదాభిమాన దుర్మత బహు
భాషియైన కురురాజె చటంజనుచున్న వాడొకో 

- సమస్య మనల్ని భయపెట్టినంతకాలం మనం సమస్యని పరిష్కరించలేం









తెలుగు వెలుగు - 28 జూన్ 2015

#తెలుగు భాష ఔన్నత్యం

మట్టిలో పుట్టిన మాణిక్యాల సొబగులు
సంస్కృతం నుంచి తెచ్చుకున్న తేనె పట్టు
వలసొచ్చిన పదాల వలపులు
అలవోకగా పుట్టిన జానపదాల నగవులు
అనువాదాలతో వచ్చిన అన్యదేశ్యాలు
పరిమళమై పల్లవిస్తాయి జనం నోళ్ళలో నానుతాయి
పదాల పిట్టల్లా తెలుగు నేలపై వాలి సందడి చేస్తాయి
వాడుకలో ఒదిగిన భాషాసిరులు మన తెలుగు విరులు

#
మాతృ భాషలో మాట్లాడుదాం
మమతానురాగాలు పంచుదాం

# చొక్కాపు వెంకటరమణ

వీరు తెలుగు బాల సాహిత్యానికి చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బాల సాహిత్య పురస్కారంతో గౌరవించింది

# సంతానం గురించిన చింత
(సంసార నటన - కాలకూర నారాయణరావు గారి ప్రహసనం)

కనెడు వరకు లేరు లేరనెడి చింత
కన్న తర్వాత వారి రోగముల చింత (బాలారిష్టాలు)
ఆవల అవిదేయులయి పోదురనెడి చింత
చదువులందు సర్వోన్నత స్థాన చింత
చింతయే కాదె సతతంబు సంతు వలెనా

# జాతీయం
ముక్తసరిగా మాట్లాడుతారండి
ముక్త - ముత్యం ; సరి - దండ

మాట్లాడేపుడు జాగ్రత్తగా సందర్భోచితంగా మాట్లాడితే ముక్తసరి అంటారు. అలా మాట్లాడితే మాట అందంగా ఉంటుంది, పని నెరవేరుతుంది,  తగాదాలు రావు













తెలుగు వెలుగు - 21 జూన్ 2015

# తెలుగు భాష స్థితి  
కావ్య నాటకాలకు ఆధారమైన భాష
సరస సాహిత్య్మందు రాజ్యమేలిన భాష
కవితలందు జనుల బతుకు నింపిన చారిత్రక భాష
జాతికి జీవ కర్రయై వారసత్వముగానందిన మాతృ భాష
కానీ నేడు బడుల యందు, పాలిన యందు, జనుల నాలుకల యందు సదిలి పోవుచుండె

# మనసు కవి ఆచార్య ఆత్రేయ
# కవనం అంటే కవిత్వం

# చిక్కారామదాసు 

చిక్కా రామదాసు గారు నల్లగొండ జిల్లా మరియాల వాస్తవ్యులు. వారు చిన్న వస్త్ర వ్యాపారి అయినా వారికి మాతృ భాష పై ఉన్న ప్రేమ వారిని తెలుగు సాహిత్య కళా పీఠం స్థాపించి భాషాభిమానాన్ని ప్రోత్సహించేలా చేస్తుంది.

వారి మాటలు:
- పిల్లలకు మాతృ భాష మీద మక్కువ ఏర్పడాలంటే శతకాలను పరిచయం చేయాలి .
- తెలుగుకి పట్టిన తెగులు గూర్చి వారి పద్యం
అమ్మ పదములోని కమ్మదనము పోయి పిరమిడ్ల మమ్మీలు వెలుగు జూసే
నాన్నాయనెడు మాట నాలుకనే వీడ డాడీల తూటాలు దాడి జేసె
అన్నయో తమ్ముడు యన్నగా బ్రదరాయె  చెల్లియో అక్కయో సిస్టరాయె
అత్తయిన పిన్నయిన ఆంటియె బాబాయొ మామయొ అంకులై మహిని వెలిగె
హాయ్ హలో అంచు షేకుహ్యాండు ఆటలాడ బై వెల్కమ్ ఒకేలు సీయు  యనెడి ఆంగ్లపదజాల
మీరీతి ఆక్రమింప తెలుగు భాషకు విడలేని తెగులు రగిలె

- పలకాలి తెలుగు మాట ప్రతి నోట కనబడాలి తెలుగు రాత ప్రతిచోట

# కాళ్ళ గజ్జి కంకాళమ్మ
కాళ్ళకు గజ్జి వచ్చిన సమయంలో చేసుకోవాల్సిన వైద్యాన్ని ఉక్తపదాగ్రస్త అలంకారంలో ఒక పాటగా పొందు పరిచారు 

కాళ్ళా గజ్జి కంకాళమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ
మొగ్గా కాదు మోదుగు నీరు
నీరూ కాదు నిమ్మల బావి
బావీ కాదు బచ్చల కూర
కూరా కాదు కుంకం మెట్టు
మెట్టూ కాదు మేదర ఇల్లు
ఇల్లూ కాదు ఈగల తొట్టె
తొట్టీ జరిపీ పక్కన బెట్టు
కాళ్ళూ గడిగి గట్టున పెట్టు

# సామెత
కర్ణుడితో భారతం సరి కార్తీక మాసంతో వానలు సరి

# జాతీయం
ఆయనకు కొంచెం ఫాసిజం ఎక్కువ
ఫాసిజం అంటే గర్వం, సోకు, ఆర్భాటం

# పలుకుబడి
పేనుకు పెత్తనం ఇవ్వకూడదు 





















Saturday, July 4, 2015

తెలుగు వెలుగు - 14 జూన్ 2015

#అక్షర వాచస్పతికి నివాళి
తెలంగాణా వ్యాసుడు, అక్షర వాచస్పతి అని పేరొందిన దాశరథి రంగాచార్య 8 జూన్ న పరమ పదించారు.

సాంప్రదాయ కుటుంబం నుండి వొచ్చిన చిన్నతనంలోనే సామాజిక పరిస్థితులను జీర్ణించుకోలేక అన్యాయాన్ని ఎదిరిస్తూ పోరాట బాట పట్టాడు. అతను తెలంగాణ సాహిత్యానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. అతని రచనలు తెలంగాణా సామాజిక జీవితాన్ని యదాతధంగా ఆవిష్కరిస్తాయి. అతను తన రచనలు చేతల ద్వారా తెలంగాణా బతుకుల్లోని జీవన శక్తిని పట్టుకున్నాడు, భాషలోని యాస సొగసుల్ని ఆవిష్కరించాడు. అనుభవానికి నిజాయితీని అద్దాడు. మానవత, ఆదర్శాన్ని రెండు కల్లుగా, సమాజ హితాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని ఒకటిగా బావించాడు. మార్క్సిజాన్ని, వేదసారాన్ని అన్వయం చేసుకున్న గొప్ప తత్వవేత్త. మట్టి బతుకుల అక్షర శిల్పి, తరతరాలకు రచనా వారధి దాశరథి  

Saturday, June 27, 2015

నవ జీవన వేదం - 318

# ప్రార్ధనా శ్లోకం 
ఏమియు సేయలేక మనసింతయు కట్టగలేక నీదు నిమ్మోమును 
చూచుచుందు మొగమోటమే లేదు రవంతయు దీనిలో ఈ మది 
మాయయంట ఇది యేడ్చేటి ఈ జగమెల్ల మాయయంట 
ఓ మహిళామణి కడకయోమయమయ్యేను బుద్దియంతయున్ 

# హనుమంతుని వాలా విలాసము- వాల్మీకి 
లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే 
అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్చ్రిత:

# వైజయంతి  

వైజయంతీ - విష్ణు మూర్తి మెడలో మాల; ఇంద్రుని జెండా 

# ఆరు గుణాలు 
ఉత్సాహం సాహసం ధైర్యం బుధ్ధి శక్తి పరాక్రమ:
షడేతే యత్ర తిష్టంతే తత్ర దైవోపిదిష్టంతే 

హిందూ ధర్మంలో ఉండే ఉత్సాహానికి హనుమంతుడు ప్రతీక 

ఒక ఉత్సాహమైన పని చేస్తున్నప్పుడు శరీరంలోని అవయాలన్నీ ఉత్సాహంగా పని చేస్తాయి 

# హనుమంతుడు - కాషాయ జెండా 
ధ్యేయమ్ముల్ నవలోక జీవనమ్ములై దేశాంబికాహస్త 
కాషాయాభ్యంజిత కేతనమ్ములవి సౌజన్యంబు పండించెడిన్ 
నా యీ జాతి సౌందర్య రేఖాయామిన్యనురాగమూర్తి వ్యాఖ్యానించు 
విశ్వమ్మునే శ్రేయోదాయక కావ్యవైఖరుల నాశ్లేషించు ఆత్మీయతన్   

# పవనుని పుత్రోత్సాహం - విశ్వనాథ సత్యనారాయణ 
అంత సమర్ధుడైన కొడుకు అంబుజనాభుడు రామ కార్య 
సంక్రాంత మనస్కుడవుచు జనగా పవమానుడు భీతిమాలి 
వ్రుత్తాంతమెరింగి వచ్చునను ధైర్యముచే సుతు కౌగిలించు
 కొంచు ఒక్కంతగా వెనక్కేగి ప్రమదాకృతి ఈలలు వేసి కొన్చుగిన్ 











తెలుగు వెలుగు - 7 జూన్ 2015

# తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి 

"మారుతున్న తరుణంలో మాతృ భాషకు లేదు స్థానం 
మమకారాలు దూరమవుతున్న ప్రస్తుత తరుణం
చిన్ననాడే  చిన్న చూపుతో తల్లి భాషకు దూరం 
అమ్మా నాన్నల పలకరింపులు కనుమరుగవుతున్న కలవరం 
పాడిపంటల్లో పరిణవిల్లే జానపదాలు సైతం జారిపోతున్న కాలం
పాత పదాల పదును తగ్గి పస వాడిపోతున్న వైనం 
ఆనాటి ఆటలు పాడుకున్న తెలుగు పాటలు చిన్న నాటి మాటలు 
చిగురుకైనా లేవు చింతలే తప్ప కాపాడు తత్వం కానరాదు"

# మనం తెలుసుకోవాల్సిన గోప్ప తెలుగు కవి, నవలా-కథా రచయిత పాలగుమ్మి పద్మరాజు  

# సామెతలు - జాతీయాలు 
- "కన్ను పోయేంత కాటుకవసరమా"
అలంకారం అనేది శరీర ఆరోగ్యాన్ని పాడు చేసేంత ఉండకూడదు 

- "వాళ్లదంతా బీరకాయ పీచు"
అక్క కొడుకుకి తమ్ముడి పిల్లనిస్తే మేనరికం. అదే అక్క కూతురిని తమ్ముడు కొడుక్కిస్తే ఎదురు మేనరికం. ఇలా మేనరికాలు ఎదురు మేనరికాలతో వరుసలు తేల్చుకోలేనంత బందాలు ఒక కుటుంబంలో ఉంటే బీరకాయ పీచు అంటారు   

సాహిత్యంలో హాస్యం - 231

# పాతబడ్డాయా? 
కొన్ని విషయాలు జీవితంలో ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటాయి. కాలంతో పాటు వాటిని పాత బడ్డాయి అనుకోకూడదు. అలాంటివి కొన్ని క్రింది పద్యంలో 
తాంబూళం రామగాధాచ జాయాచ హిత భాషిణ:
అన్నంచ సూప సంసృష్టం నూతనా దినే దినే 

# కవుల మనస్తత్వం గురించి

మోదములోన మోదమై పోదురు కేదములోన కేదమై పోదురు 
సర్వమున్ కరిగిపోవును వారల సృష్టి వారి ఆహ్లాద వినోదముల్ 
కడు విలక్షణముల్ కవులన్న నిత్య సూర్యోదయ కాల 
మానస సరోవర హంసలటుల్ రసప్రియుల్ 

# హితవు 

విన్నదాన్ని ఆస్వాదించాలి, అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, ఆచరించాలి 

# ఒక అభాగ్యుడు కృష్ణ దేవరాయతో చెప్పిన కష్టాలు 

గురువుల రాక, దాసి మృతి గుర్రపు దాడియు అల్లుడి అల్కయున్ 
వరసతి గర్భవేదన వివాహము విత్తురు జల్లు కార్తియును 
పొరుగొన నప్పు భాద చెవి పోటును వీధిని దొమ్మరాటయును
కరువు దరిద్రమాబ్ధికమును కల్గెనొకప్పుడు క్రిష్ణ భూవరా   

Saturday, June 6, 2015

తెలుగు వెలుగు - 24 మే 2015

# తెలుగు భాష అమలు 
అన్య భాషలో పాలన, అరువు భాషలో విద్య అందదు పూర్తిగా ప్రజలకెప్పుడు. పరభాషలో ప్రావీణ్యం, ఇతర భాషలో ఉపాధి కొంతవరకే పరిమితం. సొంత భాషలో ఆలోచన, మాతృభాషలో సృజన అభివృద్ధికి సోపానం. స్వభాషలో చట్టాలు, అమ్మ భాషలో ఇచ్చే తీర్పులు అర్ధమవుతాయి అందరికి. 

# తెలుగు వారి భోజనం 
కొల్వైయుండెడు మిర్పకందిపోడితో గోంగూర పచ్చళ్ళతో 
వెలుగుల్ జిమ్మెడు శాకపాకములతో వేపుళ్ళతో వెన్నతో 
పులకల్ రేపెడి ఆవకాయ రుచితో పూర్నాలతో నేతితో 
ఇలా దేవేంద్రుడి పీఠమే తెలుగు వారింటన్ చావుల్నింపెడిన్    

దేవేద్రుడి పీఠమ్ - చింతామణి 

# సామెతలు  
- కన్నతండ్రి విలువ కన్నుమూస్తే గాని తెలియదన్నారు 
- వాడా పుల్లబెట్టే రకం 

తెలుగు వెలుగు - 31 మే 2015

# జీవితంలో చివరి దాక దొరకనివి 
నాయకుని పీఠమొక్కటి సాయక శిఖయొక్కటి 
లుబ్ధసంపదయున్ ప్రజ్ఞాయుదుని బోధసారము 
ఆయువు చనుదాక అన్యులందంగలరె 

#సామెతలు 
- కోటి విద్యలున్నా కొండ్రకు తక్కువే 
- పురిట్లోనే సంధి కొట్టడం (అనాస వ్యాధి ని సంది అనేవారు)

# విష్ణువు సర్వేశ్వరుడు 
శివుని గుళ్ళోకి వెళ్తే తీర్థం పోస్తారు. అదే విష్ణువు గుళ్ళోకి వెళ్తే పులిహోరా, చక్కర పొంగలి పెడతారు. ఇలా అన్ని దొరుకుతున్న గుళ్ళో ఉన్న విష్ణువు సర్వేశ్వరుడు కాని శివుడు కాదు అని చమత్కారం  

# వాడకం  
- మాటలతో మోసం చేస్తే జిత్తుల మారి నక్కతో పోలుస్తారు 

సాహిత్యంలో హాస్యం - 230

# ప్రార్థనాశ్లోకం 
నవ్వుల్నింపితివమ్మా నా బ్రతుకునన్ నా వాక్చమత్కారతన్ 
నవ్వింతు మసిబొగ్గునైన జననీ నవ్యాతినవ్యమ్ములై రూవన్ 
జారు చలోక్తులున్ సుకవితారూపమ్మునన్ నింపి నీ నవ్వుల్ 
నింపెద లోకమందున విషణ్నాశ్యంబుల హాస్యంబుగా 

- భగవంతుడు మనకు ఏది ఇచ్చాడో దాన్ని పది మందికి కృతజ్ఞతగ అందించడం మన భాద్యత 
- సంతోషాన్ని పది మందికి పంచు సంతాపాన్ని నీలోనే ఉంచు అనే త్యాగాభావనని  అలవరచుకోవాలి

# జంతువులు పక్షులనుండి మనం నేర్చుకోవాల్సింది 
సుకవద్భాషణం కుర్యాత్ అజవద్భోజనం తథా 
కాకవన్మైధునమ్ కుర్యాత్ గజవత్ స్నానమాచరేత్ 

ప్రియవాక్య ప్రధానేన సర్వేతుష్యంతి జాంతవ:
తస్మాత్తదేవ వక్తవ్యం వచనేక దరిద్రత:

- తినడం అనేది కేవలం శక్తి కోసం కాదు. ఆరు రుచులతో భోజనం చేయమని పెద్దలు ఎందుకు చెప్పారంటే, తినడంలో చేదు , తీపి, వగరు, ఘాటు ఉన్నట్టే జీవితం కూడా నవరస భరితమే. ఆరు రుచులతో కూడిన తినడాన్నైతే ఎలా అస్వాదిస్తామో నవరస భరితమైన జీవితాన్ని కూడా అలానే అనుభవించాలి 

- విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిత స్థితి:
సువివేచ స్వపాహేచ పండితా:సమ దర్షిన:

# శ్రీనాథుని పద్యోక్తులు 
- పలనాడు ఆచార సాంప్రదాయాలు 
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు 
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు 
సజ్జ జొన్న కూళ్లు సర్పంబును తేళ్ళు 
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు 

- శివుడుకి గంగెందుకు 
సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్ 
తిరిపముడకిద్దరాండ్ర పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ 

# భగవద్గీతను విన్నది ఒక్కడే 
భగవద్గీతను జగమందు విన్నదొక్కడే 
సగమైనా నిండ లేదని వగవంగా కొనియలేదు 
భగవద్గీతను జగమందు విన్నదొక్కడే
జగమంతయు వ్యాప్తి చెందెను జ్ఞానప్రతిభన్  
  








సాహిత్యంలో హాస్యం - 229

# భార్యా బాధితులైన గురుశిష్యులు 
గురువు తన భార్యను అదుపులో పెట్టుకోకపోవడం చూచి ఒక శిష్యుడు ఆ గురువుని ఆక్షేపిస్తాడు. అదే కాక భార్యని ఎలా అదుపులో పెట్టుకొవాలో తన పెళ్ళయ్యాక చూపిస్తా అని నోరు జారుతాడు. కొంత కాలానికి ఆ శిషుడి పెళ్లి అవుతుంది. ఒక సందర్భంలో తన ఇంటికి వచ్చిన గురువుకి తను చేసిన శపథం గుర్తుకొచ్చి భార్యతో గురువు ఉన్నంత సేపు మర్యాద ఇవ్వమని, తాను ఏమన్నా భరించమని వేడుకుంటాడు. కాని వడ్డిస్తున్న సమయంలో సహజంగా గయ్యాళి స్వభావి అయిన భార్య భర్త అంటున్న మాటలకు ఓపిక నశించి భర్త నెత్తి మీద తను వడ్డిస్తున్న కుండతో కొట్టి, కుండ ముక్కలైనందుకు డబ్బులు కూడా ఇమ్మంటుంది. అది చూసిన గురువుకి అంతా అవగతమై ఈ సమయంలో తన భార్య కాని కనపడితే దణ్ణం పెడతా అని కింది పద్యం చెపుతాడు 

అనేక శత భాండాని పిన్నాని మామ మస్తకే 
మహోభాగ్యవతీ నారీ భాండమునిమ్నయాచతే 

# జరుక్ శాస్త్రి విశ్వనాథుల వారికి పెట్టిన పేరు భాషానపాకప్రభో 

కించిక్తిక్త కషాయభాడబరసక్షేపాతిరేఖాతి వాక్సంచార 
ప్రచయావకాశాములతో కవ్యుత్కగండాశ్వముల్ సెంచెల్లీల
రహించి పల్కినగతిన్ సాధించి వేధించుమా పంచారించి 
ప్రవళ్ళికావృతికృతిన్ భాషాన పాకప్రభో 

#విశ్వనాథుల వారి రామ సంభోధన 
క్షోణిబర వారణావతారనాలీలాకృతి 

# ఛలోక్తి 
ఎక్కడ ఆగని బస్సును నాన్ స్టాప్ బస్సు అంటే ప్రతి చోట ఆగే బస్సును నానాస్టాప్ బస్సు అనొచ్చు 

Wednesday, May 27, 2015

నవజీవన వేదం - 317

#
- అవిశ్వాసమే అభివృద్ధికి అన్ని విదాల ఆటంకం 
- మనం ఒక ధృడమైన నిశ్చయంతో పని తలపెడితే మనతో ఎవరు ఉన్నారు ఎవరు వెళ్ళిపోయారో పట్టిచ్చుకోవద్దు - అప్పుడే కార్యసాధన అవుతుంది 

# వాల్మికి - సుందరకాండ 
విముక్తాస్తస్య వేగేన ముక్త్వాపుష్పాణి తే ద్రుమా:
అవశీర్యంత సలిలే నివృత్తాస్సుహృదో యధా 

# మంచి - చెడులకి ఎవరు తోడు 
శుభందానంతు గఛ్చంతం త్రియంచోపి సహాయతే 
కుపందానంతు గఛ్చంతం సోదరోపి విముంచ్యతి 

# సమస్యా పూరణం - నాలుగు పట్టి మూడు చని ఐదున రెండిని దాటి ఒక్కడై
వాలము జ్వాలరూపమై వార్ధిని దాటగ వాయు శూరుడే 
లాలన సేయగాబడి నలాదులచేత మహేంద్రపర్వంబేలగ 
నూతగా తనువునెంతయు పెంచి విశాలవక్షుడై 
నాలుగు పట్టి మూడు చని ఐదున రెండిని దాటి ఒక్కడై 

Tuesday, May 26, 2015

నవజీవన వేదం - 316

# మాట-మంతి
 మనం ఏ  పని తలపెట్టిన మూడు దశలు ఉంటాయి
మొదటి దశలో వెక్కిరింపు,  రెండో దశలో  వ్యతిరేకింపు మరి  దశలో అనుసరింపే

నీతి ప్రౌడ విహార ధీర నిపుణుల్ నిందింపనీ మెచ్చనీ 
ఖ్యాతిన్ జెందిన సంపదల్ నిలువనీ గాడంబుగా సాగనీ 
గాతం బప్పులు గల్గనీ  నీయతమేగా యుగాంతంబునన్ 
నీతి శ్రాక్యపదంబు దప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్ 

# వాల్మీకి- సుందరకాండ 
ఏక ముక్త్వాతు హనుమాన్ వానరాన్వానరోత్తమ:
ఉత్పపాతాత వేగేన వేగవా నవిచారయాన్ 
సుపర్నమివ చాత్మానం మేనే స కపి కుంజర:
#
కొండన్ కొండయనంగ లేచి పవనాంకూరంబు 
జంజా మరుత్చండాకారము దాల్చి వార్ధి పొడుగై 
సంద్రంమ్ముదాటన్ వపుద్దండంబింత చమర్ప 
యీల వనసామ్రాజ్యమ్ము సేవా సుధాభాండంబై 
క్షితిజాత భాష్పజనిత ఔర్వమ్బింత శాంతించెడిన్  












Monday, May 25, 2015

నవజీవన వేదం - 315

# మంచి మాటలు 
ప్రతీది పుట్టుకతో వస్తుందన్న దౌర్భాగ్య ఆలోచన మన దేశాన్ని కుంటుపడుస్తుంది 

హనుమంతుడు సేవకుడు కానీ దేవుడయ్యాడు 

మనిషికి ఉండాల్సినది ఆత్మవిశ్వాసం కాని గుడ్డి నమ్మకం కాదు మిత్రమా 

#వాల్మీకి - సుందరకాండ 
సర్వధా కృతకార్యో హమేష్యామి సహా సీతయా 
ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం 

# వివేకానందుడు - చికాగో ప్రసంగం 
గుడిగంటల్ ధ్వనియింప జేసెను చికాగో వేదికన్ 
ప్రేక్షకులు గడియల్ గంటల్ రోజులున్ క్షణములట్లు 
ఆత్మీయతావృష్టిలో తడియన్ స్వామి వచోవిలాసములు 
తత్వంబుల్ కథల్ గేయముల్ హడలెత్తించెను పశ్చిమావళి ఆర్యవర్తమవునోయన్ 
# పాపపుణ్యాలు - జ్ఞాపకాలు  
బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం 
పాపకర్మనాం ప్రాయశ్చిత్త మహోజ్ఞానం 
ఇది వేదాంత డిండిబ: 
#కల్పవృక్షం - సుందరకాండ 
పరసి ఉపానవట్టముగ బట్టిన శేషుని వోలె లంక చుట్టిర 
ఒక చుట్టి తోక ఒక యేపున ఊపున పెల్లగించి నిర్భరముగా 
బోదెచ్చి రాఘవుని పాదసమీపంబునందు బెట్టెదన్ 
ధరణిజనాయనేవేతకు దైత్యపురీగూడదేశముల్ 

#హనుమంతు - సంజీవని 
జనసంజీవని నెత్తిదెచ్చెను ప్రశంసల్ సేయ రాముండటన్ 
ఘన దివ్యౌషద పేటికన్ లలిత వృక్ష శ్రీలతా వాటికన్ 
జననానావిధరోగవారణ కళాశాస్త్ర పేటికన్ 
హనుమంతుడతిలోకవేగమున తానాకాశ మార్గంబున 






Friday, May 22, 2015

నవజీవన వేదం - 314

# మంచి మాటలు 
ఆత్మ స్తుతి మంచిది కాదు 
అరిషడ్వర్గాలను జయించడమే అసలైన విజయం 

మనం అనుకున్న పని కచ్చితంగా సాధించాలంటే అది బహిరంగంగా చెప్పడం మేలు కానీ అది అతిశయోక్తి కాకూడదు 
యజమాని మీద మనకు చాలా గౌరవం ఉండాలి. 

శాసనాల ద్వారా ఏం పనులు కావు. శ్వాస లాంటి కళ ద్వారా చైతన్యం తెప్పించోచ్చు. అలాంటి చైతన్యమే శాసనాలు చేయలేనివి చేయిస్తుంది 

గుణగ్రాహి అంటే రసజ్ఞుడు 
 # వాల్మికి సుందరకాండ 
యధా రాఘవనిర్ముక్తశ్శర శ్శ్వసన విక్రమ:
గఛ్చే త్తద్వద్గమిశ్యామి లంకాం రావణపాలితమ్

# శ్రీ కృష్ణదేవరాయలు - ఆముక్త మాల్యద 
(క్రింది పద్యంలో తప్పులు ఉండవచ్చు)
చందనస్తిత బిడౌజ క్షత్రు జాడ్య కృత్జం జామరుత్ గరుచ్చాక్రుతములు 
క్రవ్యాధర గాత్రకణదశ్రు గ్రాహణ స్ఫుటశల్యహవ్యభుక్చోక్రుతములు 
యోధవర్మిత హ్రుత్పుటోకాంత నిజపాదసాలాశ్ముకృత ముహుష్టాక్రుతములు 
పతితోగ్రరక్షక్కబంధ భారహృశార్తి భగ్నభొగ ఫణీంద్ర భూకృతములు 
శ్రాంతిరద్య నిరంతరచ్చాయదములు దివ్య తావగా గార్ముకోత్ప్రేరితములు 
కలుషములడంచు గాక లంకాపురాంగణాంబర జలద్కలంబ కదంబకుములు  

Thursday, May 21, 2015

నవజీవన వేదం - 313

#
ఒక్క ప్రశ్నకైన జవాబు దొరకదయ్యె సృష్టి దుర్గమయ్యే 
ప్రశ్నలేని మౌన భావమే నయమవును అనియు చెప్పదయ్యే అమ్మవారు 

#
మార్గమాలోకయాన్ దూరాదూర్ధ్వం ప్రణిహితేక్షణ:
రురోధ హృదయే ప్రాణానాకాశ మవలోకయాన్ 

#
ప్రవహించే ప్రవాహాన్ని అడ్డుకుంటే అక్కడ శక్తి పుడుతుంది 

#
ప్రాధాన్యం అనేది సమయాన్ని బట్టి ఉండదు సందర్భాన్ని బట్టి ఉంటుంది 

#
స్మరణ - అవగాహన - అన్వయం - ఆచరణ 

#
పాద ద్వంధము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మా
దమున్ బరమార్చి బుద్దిలతకున్ మారాకు హర్తించి 
నిష్కేద బ్రహ్మ పదావళమ్మున గతిన్ గ్రీడించు యోగీంద్రు 
మర్యాదన్ నక్రము విక్రమించే కరి పాదాక్రాంతమై 

# ఆనందం వేరు సుఖం వేరు 
ఆనందం అనేది స్థితి సుఖం ఒక అనుభూతి 
ఆవలించినప్పుడు ఏ శబ్దం వినబడదు 

Wednesday, May 20, 2015

నవజీవన వేదం - 312

#
రామార్ధం వానరార్ధం చ చికీర్షన్ దుష్కరమ్ 
సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి 

రామో విగ్రహవాన్ ధర్మ:
#
సుందర సుందరుండు పతి సుందరి వేరోకతిన్ భజించుచున్ 
కుందుచు మారిపోయి తనకున్ బహుకాలము కాకపోయి 
ఆ ముందరి కోర్కె లేదనిన పోలిక దారుణి దక్షిణ స్తన స్పందము 
పొందెనన్నటుల క్ష్వామదరమలలనాడెను ఉగ్రమై 

Tuesday, May 19, 2015

నవజీవన వేదం - 311

#
దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ:
సహితా స్తస్థురాకాశే వీక్షాంచకృశ్చ పర్వతం 
#
ఎప్పుడు ఎవ్వరి శక్తి ఎలా బయల్పడుతుందో తెలియదు అందుకని పిల్లలని నిరుత్సాహ పరచకూడదు 

#
పువ్వుల్లో పురుగులు బురదలో కమలాలు 

#
దోచుకొనన్ నేర్చిన దొంగ దాగుకొనుట ఎచ్చో నిజమేకాని 
కాచుకొనన్ నేర్చిన తల్లి దాగుకొనునా సుధ్దాంతకైలాసమా 
ఒక చందోమయమైన వాక్యమున ఏదో గోడు వేల్ల్న్గా బోసుకొనన్ 
రక్షణ సేయు వారెరెవరో చూపించరే మోము 

#
నిలిపెన్ రెప్పల బృందిమన్ విశదిమన్ నేత్రంబులన్ 
చూచుకంబుల నా కానిమ మేకలంద్రడిమ నిమ్మోమున్ 
సుదాపాండిమన్ బలిమిన్ చన్నుల శ్రోనిపాలి గరిమన్ 
మధ్యంబునన్ బృంహిమన్ లలితాత్మన్ లహిమన్ మహామహిమ మేనన్ 
గర్భదుల వారయై 


Monday, May 18, 2015

నవజీవన వేదం - 138

#
అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే 
కమ్మగా నేర్పినారు తెలుగమ్మల మించిన అమ్మ లెవ్వరో 
ఇమ్మహి ఆవుని ఇంటిని ఇక నీశ్వరుని దలపించినారు 
మాయమ్మలో తెల్గు కావ్యములనంకితమిద్దము వారి ప్రేమకై 

అమ్మ ధర్మానికి ప్రతీక 
ఆవు అర్ధానికి ప్రతీక 
ఇల్లు కామ పురుషార్దానికి ప్రతీక (ఉచిత కోరికలతో)
ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక 
#
ఆదిత్యానమాహం విష్ణు: జ్యోతిషాం రవిరంశుమాన్ 
మరీచిర్మరుతాస్మి నక్షత్రానామాహం శశీ 

#
ఏ వేదంబు పఠించె లూత? భుజంగ బేశాస్త్రముల్చూచె, దా 
నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచే మంత్రమూహించే, బో 
ధా విర్భావనిదానముల్ చదువులయ్యా? కావు! మీ పాదసం 
సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!


Sunday, May 17, 2015

నవజీవన వేదం - 137


#
అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత:
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ 

#
ఉపాధ్యాయుడి కర్తవ్యం: పిల్లవాడికి మార్గంలో అర్ధం కాకపోతే మరో మార్గంలో మరో మార్గంలో చెప్పడం 

#
జిడ్డుక్రిష్ణమూర్తిది శిఖర స్థాయి వేదాంతం 

#
అద్దములొన గన్పడు మహానగరంబును వోలి విశ్వమే 
ముద్దులు మూటగట్టును ప్రమోదమునించును మాయమవును 
తానద్దము తీసివేయ పరమాత్ముడు కన్నా కలల్ ప్రపంచముల్ 
నిద్దురలోన కన్న కల నిక్కము కాదు గదా తలంపగన్ 

#
వీడెంబబ్బినయప్పుడున్ దమస్తుతుల్ విన్నప్పుడుంబొట్టలో 
కూడున్నప్పుడు శ్రీ విలాసములుపైకొన్నప్పుడున్ గాయకుల్ 
పాడంగా వినునప్పుడున్ జెలగుదంభప్రాయుని శ్రాణనన్ 
క్రీడాసక్తులనేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా!
  

నవజీవన వేదం - 136

#
దేవుడి స్థాయికి జీవుడు ఎదగలేక దేవుణ్ణి జీవుడి స్థాయికి లాగుతాడు. జీవుడంటే మనస్సు. 


కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ 
కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా 

#
అరూపం - రూపం; నిరంజనం- సాంజనం; నిరవయం - సావయం; అభిన్నం- భిన్నం; అసత్ - సత్ 

# భారతీయ పంచాంగ కాలమానంలో వారాలకు ప్రాధాన్యం లేదు 

#
నిప్పై పాతక దూలశైలమడచున్ నీ నామము న్మానవుల్ 
దావున్ దవ్వుల విన్న సంతక భుజాదర్పోద్దత క్లేశముల్ 
తప్పుం దీరును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ 
చెప్పంగా దమ కింక శంకలుండవలెనా? శ్రీకాళహస్తీశ్వరా!

# పాపం పుణ్యం మనస్సులో ఉండే జ్ఞాపకం తప్ప ఏమి లేదు 
   


Saturday, May 16, 2015

సాహిత్యంలో హాస్యం - 228

# కాళిదాసు - సమయ స్ఫూర్తి 
సద్యస్ఫూర్తి, ప్రతిభ కలిగి ఉంటే దేన్నైనా సమర్ధించుకు రావచ్చు. జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా దాటుకు రావచ్చు. ఒకసారి కాళిదాసు రాజు కొల్వుకి బయలుదేరి తనతో పాటు ఒక గుడ్డలో రామాయణ పుస్తకాన్ని చంకలో పెట్టి తీస్కెల్లాడు . దారి మధ్యలో అమ్మవారి గుడి కనపడితే దర్శనార్ధం ఆ గుళ్ళోకి వెళ్ళాడు. అదే అదనుగా చూసి కాళిదాసు అంటే గిట్టని వారు ఆ పుస్తకానికి బదులు బ్రతికి ఉనా చెప్పాను పెట్టారు. వేగిరపాటులో కాళిదాసు అది అంతగా పట్టించుకోలేదు. కొలువులోకి వెళ్ళాక అర్ధమయింది అది పుస్తకం కాదని. రాజు ఆగ్రహానికి గురికావోద్దని ఆ చేపను  పుస్తకం తో పోల్చి చెప్పాడు. ఆ నేపధ్యంలో రాజుకి కాళిదాసు కి మధ్యలో జరిగిన సంభాషణ 

రాజు: కక్షే కింతవ 
కాళిదాసు: పుస్తకం  
రాజు: కిముదకం 
కాళిదాసు: కావ్యార్ధ సారోధకం 
రాజు: గంధ కిం 
కాళిదాసు: రఘురామ రావణ మహా సంగ్రామ రంగొద్భవా 
రాజు: కిం పుచ్చ:
కాళిదాసు: నవతాళపత్ర లిఖితం 
రాజు: కిం పుస్తకం హే కవే 
కాళిదాసు: రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం 

కాళిదాసు వాల్మీకి  గురించి
మంద: కవీశ ప్రార్థీ 
గమిష్యాం యపహాశ్యతాం 
ప్రాంసు లభ్యే భలే లోభాత్ 
లోభాదుద్భాహు రివవామన:

కాళిదాసుకి అమ్మవారి నుండి లభించిన యోగ్యతా పత్రం
త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం ససంశయ: 

# చిత్తశుద్ది -> వాక్శుద్ధి - వాక్సిద్ది 
 మనసులో ఏ ఆలోచనలు లేకపోవడమే చిత్తశుద్ది (శుద్ది, శుభ్రం వేరు)

# సూర్యుడికి హేమంత రుతువుకి మధ్య యుద్ధం  
 హిన సైన్యమ్ముల పారద్రోలెనకటా హేమంత పూజనియై 
ఘన మార్తాండ మరీచి మాలికలు దాగన్ జొచ్చెనో కామినీ 
ఘన వక్షోజ దరాదరమ్ముల యొడిన్ కాకున్న సూర్యాంశువుల్ 
గనగా మందములవునే భామ కుచముల్ కవ్వించునె వెచ్చగా 

చక్రే చండ రుచాసమం రనమసౌ హేమంత ప్రుధ్వీదర:
ఏయే తత్ర జితా దివాకరాకరనస్తే మనే తక్షణాత్
కాంతానాం కుచభూధరే నిదదిరే మన్యేహమేవం తథా 
నోచెన్ మంద: కరక్కదమును దినకర: తప్తశ్చతన్వీస్తన:

#కవిత్వం  
 లౌకిక వాస్తవాన్ని మనోహరమైన ఊహతో సమర్ధించాలి లేదా మనోహరమైన ఊహని లౌకిక వాస్తవంతో సమర్ధించాలి 

# ఆధునిక భయాలు 
ఉప్పు తినగ భయము  ఊరగాయ భయము 
తీపిదినగ భయము దిష్టి భయము 
పూజలందు భయము పుట్టుమచ్చ భయము 
భయము లేనిదోకటే పాపభయము 


నవజీవన వేదం - 135

# ఈ కాలంలో జనాలు మహత్తర వైరాగ్య ప్రపంచంలో ఎవరంటే ఎవరికీ పట్టనట్టుగా ఉన్నారు 

# చివరకు మిగాలాల్సింది ఏకాంతమే 

# భగవద్గీత - విభూతి యోగం 
తేశామేవాను కంపార్ధం 
ఆహమజ్ఞాన జంతమ:
నాశాయామ్యత్మ భావస్తు 
జ్ఞాన దీపేనా భాస్వతా 

# కాళహస్తి శతకం - బంధాలు 

ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు మహా 
బంధనమ్మేల నా మెడ గట్టినాడవు ఇక నిన్నేవేళ జింతింతు 
నిర్మూలంబైన మనంబులోన కడు దుర్మోహాబ్దిలో గ్రుంకి 
ఈ శీలావాలపు చింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా 

#ఎప్పుడు ఏవి వదిలేయవలను 

ఉదానస్య తృణం విత్తం 
వీరస్య మరణం తృణం
విరక్తస్య తృణం భార్యా 
నిస్ప్రుహస్య తృణం జగత్ 


నవజీవన వేదం - 310

# సుందరకాండ - హనుమంతుడు నింగికేగుచుంటే మహేంద్రగిరి పూలకొండను తలపించిన తీరు 
తేన పాదప ముక్తేనా 
పుష్పౌహేన సుగంధినా 
సర్వత: సంవృద శైలో 

భజౌ పుష్ప మాయో యధా 

# వృద్ధుల పట్ల శ్రద్ధ 
రాలి పోవకముందే సోలిపోకుండగా 
మిగల గుగ్గిన పండ్ల మేలు గలుగు 

#పనికిరానివి 
వాసన లేని పువ్వు బుధ వర్గము లేని పురంబు 
నిత్య విశ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కుమారుడున్ 
సధభ్యాసము లేని విద్య పరిహాసము లేని శుభ ప్రసంగము 
గ్రాసము లేని కొల్వు కొరగానివి పెమ్మయసింగధీమని 

#కపిరాజు నింగికేగు  వేళ కవయిత్రి మొల్ల వర్ణన 
మొగము బిగించి పాదములు మొత్తముగా నటనోదిత్రొక్కి 
నీటుగా మొగమెత్తి భీకర కఠోర రవంబున నార్చి బాహు 
లత్యగలిత లీలలూచి వలయంబుగ వాలముద్రిప్పి వ్రేగునన్ 
నగము సగంబు గ్రుంగ కపినాథుడు నింగికి దాటే రివ్వునన్ 



Friday, May 15, 2015

నవజీవన వేదం - 134

#
అహం సర్వస్వ ప్రభవో 
మత్త సర్వం ప్రవర్తతే 
ఇతి మత్త్వా భజంతేమాం 
బుధా: భావ సమన్వితా:

#
భారతీయ తాత్విక సాహిత్యంలో శంకరాచార్య అద్వైతం మిగిలనట్టుగా మిగిలినవి లేవు 

#
శంకరాచార్య జగన్మిధ్యా అన్నాడు తప్ప జగన్నాస్తి అనలేదు 

# శివమానస పూజ - శంకరాచార్య 
ఆత్మాత్వం గిరిజామతి: సహచరా ప్రాణా  శరీరం బృహం 
పూజాతే విషయోప భోగరచన నిద్రా సమాధి స్థితి:
సంచార పదయో ప్రదక్షిణ విధి: స్తోత్రాణే సర్వాగిరహ:
యత్యద్కర్మ కరోమిదత్తమకిలం శంభోతవారాధనం 
#
దివిజక్ష్మారుహ దేను రత్న ఘనభూతి ప్రస్ఫురత్ 
రాత్నసానువు నీ విల్లు నిధీశ్వరుడు సఖుండు 
రాసికన్యా విభుండు అర్నో విశేశార్చకుడు  ఇంక నీకేనఘనుండు 
గల్గెనే నీవు చూచి విచారింపవు లేమినెవ్వడుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా 

#
కరస్తే హేమాద్రౌ గిరిజనికటస్తే ధనపత్అవు 
గృహస్తే స్వర్పూజామారి సురభి చింతామణి ఘనే 
శిరస్తే శీతాంశౌ చరణ యుగలస్తే అకిలసుభే 
కమర్ధం దాస్యేహం భవతు భవతర్ధం మమ మన:

# యువత కొబ్బరి నూనె రాయాలి జ్ఞాపక శక్తి మెరుగు పడుటకు 

నవజీవన వేదం - 309


#
నీవుందువెల్లవేళల నీవైపే చూచుచుండ నేనునునుందున్
ఈ  విశ్వమందు బంధములు ఏ వేళలనైన గాని ఏగగనిమ్మా

#
అహంకారమే అన్ని అనర్ధాలకు మూల కారణం

#
ప్రవంగ ప్రవరైర్ద్రుష్ట: ప్రవణే కృత నిశ్చయ:
 వవ్రుదే రామ వ్రుధ్యర్ధం సముద్రమివ పర్వసు

#
బండన భీముడు ఆత్మజన భాంధవుడు ఉజ్జ్వల బాణ తూన
కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాదండడ డాండ డాండ
నిదనంబులు అజాండమునిండ  మత్తవేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి

#
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటారే

# పరావస్తు చిన్నయసూరి
ఎవడు బుద్దిమంతుడో వాడు వృద్ధుడు గానీ
ఏండ్లు మీరినవాడా వృద్ధుడు

#
మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడు మారవు అవి ఎప్పుడు అలాగే ఉన్తాయి. కాని వాటిని మార్చడానికి జరిగే ప్రయత్నంలో నువ్వే గొప్ప పరిణతి చెందుతావు

#
అంగదుడు ఆంజనేయుడు వ్యతిరేఖ స్వభావులు

#
ఈ కాలంలో బంధాలు బంధుత్వాలే ప్రధానమవుతున్నాయి. ధర్మం అక్కర్లేకుండా పోతుంది

#

పర్వం - పూర్ణిమ

#
ఆ రాత్రించరుడైన పుత్రునకునై ఆరాటమున్ జెంది
ఎన్నో రాత్రులు తపియించితో జలధి నిన్నున్ జూచి పోవచ్చునే
ఆ రాజేంద్రుని ఎట్టి తార తన గాడాశ్లేషమునందుంచెనో
కారేబిడ్డలు వీరలడ్డములలో గడ్డాలలో బిడ్డలా


Thursday, May 14, 2015

నవజీవన వేదం - 133


#
అహింసా సమతా తుష్టి:
తపోధానం యశో అయశ:
భవంతి భావా భూతానాం
మత్తయేవ పృథగ్విథా:


#
అహింసా పరమో ధర్మ:

#
ప్రకృతిం పురుషం చేవ
విద్యనాతి ఉభావసి

#
ద్వైతంలో అద్వైతం చూడాలి రా; భేదంలో సమానత్వాన్ని చూడాలి రా

#
కష్టమందైనను కమ్మగా సుఖపడ నేర్వవలయు బ్రతుకు నోర్వవలయు

#
శివున్ని గెలవాలంటే మన్మధుడికి నీవే దిక్కైనావు
అలాంటి మన్మదున్ని గెలవాలంటే మాకు నీవే దిక్కమ్మా

#

భవకేళి మదిరామదంబున మహాపాపాత్ముడై
వీడు నన్ను విలోహింపడటంచు నేను నరకాన్నోరాసిపాలైన
పట్టవు బాలున్డొకవేళ ఆటచవి తోడన్ నూతగూలంగా
తండ్రి విచారింపకయుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా

#
క్రీడార్ధం సుజ ప్రపంచమకిలం
క్రీడా మృగాస్తే జనా:
యత్కర్మా చరితం మయాచ
భవథప్రీత్యేత్ భవత్యేత్ వతు: 

నవజీవన వేదం - 308

#
స సూర్యాయ మహేంద్రాయ
పవనాయ స్వయంభువే
భూతేభ్యశ్చాంజలిన్ కృత్వా
చకార గమనే మతిం

#
కురిచి సల్లని నీడల కూరుచుండి చదువమన్నను చదువరీదరవడుగులు
ఎండకెదురుగ నిలిచి చదివినతండు ఘనుడు

#
నలుసైనన్ భువిలోన జూపి పరిమాణంబెంతయో గల్గు చుక్కలకున్
చాటొనరించి భూమిజలమింకన్ జేసి ధారాధరంబులు
మింటన్ కలిగించి శూన్యమునకున్ పొల్మేర గల్పించురా
ఎలమిన్ నీ కర కౌశలమ్బహహ మాయీ సూర్యనారాయణ


Wednesday, May 13, 2015

నవ జీవన వేదం - 132

#
క్షిప్రం భవతి ధర్మాత్మా
సస్విచ్శాంతం నిగచ్చతి
కౌన్తేయ ప్రతిజానీహి
నమే భక్త: ప్రనశ్యతి

#
నీనాసందోడబాటు మాట వినుమీ నీ చేత జీతంబు నే కానిన్ బట్ట
సంతసంబు మది వేడ్కన్గోల్తును అంతస్సప్రతానీకంబుకనప్పగింపకుము
నన్ను ఆ పాటియే జాలు తేజీ నొల్లన్  కరినొల్లన్ ఒల్లను సిరులు శ్రీ కాళహస్తీశ్వరా

#
అరిషడ్వర్గాలు
కోరికలు మందకే పుడుతున్నాయి, అవి తీరకపోతే క్రోధం మనకే కలుగుతుంది; అవి నాకు తీరాలనుకోవడం వల్ల లోభం మనకే, అవి తీరకపోతే నేనుండలేను అనే మోహం మనకే, అది తీరింది అనే మదం మనకే; అది ఇంకోడికి తీరింది నాకు తీరలేదు అనే మాత్సర్యం మనకే

#
శబ్ధాతిపి పంచసిరేవపంచ
పంచత్వమాపస్వ గుణేన బద్ధా:
తురంగ మాతంగ పతంగ మీనా భ్రుంగా: (లేడి; ఏనుగు; మిడత; చేప; తుమ్మెద )
నర: పంచపిరంకితక్కిం    

నవజీవనవేదం - 307

#
అష్టసిద్ధులు : అనిమ; మహిమ; గరిమ; లహిమ; ప్రాప్తి; ప్రాకామ్యం; ఈశత్వం; వశత్వం

#
తతో రావణ నీతాయ
సీతాయా శత్రుకర్షణ :
ఇయేష పదమన్వేష్టుం
చారానా చరితే పది

#
తనదాక  వచునంతకు మనకెందుకులే యటంచు  మానుటయొకటిన్
తనదాక వచ్చినప్పుడు మన కర్మలే యటంచు మానుట యొకటిన్ 

#
దశకంటోద్విగటాట్టహాసములు సీతన్బట్టి గొన్పోవు దుర్దశ
కంటమ్మది నేలరాలిపడ నాథాయంచు ఆ దేవి ఆర్వ
శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బల్  బెట్టితిన్
వానినీ కృష నేత్రాన్చలముల అగ్ని కండికలు గ్రక్కెన్ నాదు గర్భమ్మున 

Tuesday, May 12, 2015

నవజీవన వేదం - 306

#
ఏదైనా పని తలపెడితే అయ్యి తీరాలనుకొని పని చేయాలి;ఒకవేళ అవకపోతే బాధపడకూడదు 

#

బుద్ధ్యాచాహం ప్రభశ్యామి 
మనశ్చేష్టాశ్చతమేధ 
ఆహంద్రక్ష్యామి వైదేహీం 
ప్రమోదత్వం ప్రభంగామా:

#

పాలడుగంగ కౌరవులపాలికి బోవ అతండు లోభియై 
పాలది యేడదోయనిన పాలు తెరంగరిగింప భీమ భూపాలుని 
పాలు తాను తన పాలిటి రాజ్యం అన్న పాలు నా 
పాలు సమస్త సైన్యమని పల్కుము పంకజబాభ అచ్చటన్ 

#

సహ్రుదేవ ప్రపణ్నాయ 
తవాస్మీతి చయాచతే 
అభయం సర్వ భూతేభ్యో 
దదాంయేత వ్రతంమమ 

Monday, May 11, 2015

నవజీవన వేదం - 131

#
ఒడిలో కూర్చోనియుండ నీవు మమతాయోగమ్ము బాటించి
దేవుని మై దేహమునెల్ల  తాకునపుడు ఏమో గాఢ సంరక్షలో
గుడిలో దీపమువోలె నుంటిని ఇపుడీ క్రూర ప్రపంచంబులో
అడుగుల మోపుటకే భయంబగునే అమ్మా ఎట్లు గాపేడెదో

# అపిజేత్సు దురాచారో
భజతేమా మనన్యభాత్
సాధురీవ సమంతవ్య:
సంయుక్త్వ్య వసితోహిస:

#
నమ:శివాభ్యాం నవ యవ్వనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నహేంద్ర కన్యాం వ్రుశాకేతనాభ్యాం
నమోనమ:శంకర పార్వతీభ్యాం

#

నిను సేవింపగా ఆపదల్ పొడమని నిత్యోత్సవమబ్బని
జనమాత్రుండనని మహాత్ముడనని సంసారమోహంబు
పైగోనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని
మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!




చలించని వాడె జ్ఞాని. చలించకపోవడం జ్ఞానముతో కలగాలి తప్ప మూర్ఖత్వం మొండితనం తో కాదు   

Sunday, May 10, 2015

నవజీవన వేదం - 305

#
కన్నింత త్రిప్పనీయవు నన్నే మొనరింపదలచినావో తల్లి
ఇన్నాళ్ళ శ్రమఫలంబు కన్నులముందు దలచి కథ అల్లెదవు 

#
బలం బుధ్ధిశ్చ తేజశ్చ
సత్వంచ హరిపుంగవ
విశిష్ఠమ్ సర్వభూతేషు
కిమాత్మనమసక్యశి

#

ఎవ్వాని వాకిట నిబమదపంకంబు రాజ భూషణ రజో రాజినడగు
ఎవ్వాని చారిత్రమెల్ల లోకములకు ఒజ్జయై వినయంబు నొరపు గరపు
ఎవ్వాని కడగంట నివ్వటిల్లెడు చూడ్కిమానిడ సంపదలీనుచుండు
ఎవ్వాని గుణలతలు ఏడు వారాశుల కడపటి కొండపై కలయబ్రాకు
అతడు బూరి ప్రతాప మహాప్రదీప దూర వికటిత గర్వాంధకార వైరి
వీరకోటీర మణి గ్రుణి మేష్టితాంక్రితలుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు

ఏడు సముద్రాలు : లవణ - ఇక్షు - సుర- సర్పి- దది- క్షీర-జల 

నవజీవన వేదం - 304


#
వీర వానర లోకశ్య
సర్వశాస్త్ర విశారదా
త్రుష్నీ మేకాంతమాశ్రిత్య
హనూమన్ కిం నజల్పసి

#
ఆపదలందు ధైర్యగుణము అంచిత సంపదలందు తాల్మియున్
భూపసభాంతరాలమున పుష్కల వాక్చాతురత్వము ఆతి బాహుపటుశక్తియున్
కేశమునందు అనురక్తియు విద్యయందు వాంచా పరివృత్తియున్
ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికిన్ 

నవజీవన వేదం - 301

#
మనోజవం మారుత తుల్య వేగం
 జితేంద్రియం బుదిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి

#వసుచరిత్ర - రామరాజభూషణుడు

తరుణార్క బలనోద్ధతి జూపెనెవ్వాడు రుచులచే ఫలమోఘరుచులజేత
అకలంక రామ ముద్రిక పూనెనెవ్వాడు శయముచే హ్రుక్కుచే శయముచేత
మున్నీరు  పల్వలంబుగా దాటెనెవ్వాడు జవముచే గుణగనార్జవముచేత
అక్షశిక్షా ప్రౌడి అలరించెనెవ్వాడు రణముచే నియమధారణముచేత
ధరణి నెవ్వాడు దానవ ద్విరదదలన వినుతి తన కేసరి కిషోర వృత్తి దెలిపె
అతని మత్కావ్య భవ్య వాహమృత  ఘటన మంజుల స్వాంతు
హనుమంతు మది దలంతు  

నవజీవన వేదం - 302


తీక్ష్ణ కామాస్తు గంధర్వా:
తీక్ష్ణ కోపా భుజంగమా:
మృగాణాం చ భయం తీక్ష్ణం
తథస్తీక్ష్నక్  సుధామయం



కామంబున్ పెడబాయు పండితుడు సంకల్పంబు వర్జించి 
నిద్రామోదంబు లడంచు సత్వగుణచింతన్ 
లోభమున్ ప్రాజ్ఞ సేవాముద్రమున్ తొలగించు 
క్రోధము క్షమవ్యాప్తిన్ మహుచ్చున్ మతి శ్రీమాన్య 
భయమప్రమత్తమున వర్జించు దృఢ స్వాంతుడై 

కోడిపుంజు పందేలపై శ్రీనాథుని చురక



ఆ ఖగేంద్రములార కయ్యమున నీల్గి పోవుచున్నారే దేవతా భువనములకు
మీరు రంభా తిలోత్తముల్ మేనకాది భోగ కార్యార్థమై కోడిపుంజులారా!

ముద్రిక మరియు ఉంగరం


అక్షరాలు రాసి ఉంటె ముద్రిక లేకపోతే అది ఉంగరం 

మంచి సామెతలు/పదోక్తులు/చలోక్తులు/చురకలు/

# మంచి ఉంటె మైకులో చెప్పు. చెడు ఉంటె చెవిలో చెప్పు. 

# ఉద్దరించాలంటే ఉద్దరింప బడే యోగ్యత ఉండాలి
# ఆత్మవిశ్వాసం లోపిస్తే అన్నీ లోపించినట్టే
# అనురాగం మంచిదే రాగం మంచిది కాదు అనుబంధం ఉండాలి బంధం కాకూడదు 
 #
సరసో: విపరీతష్చ సరసత్వం న ముంచతే
సాక్షరా: విపరీతాశ్చే రాక్షసాయేవ కేవలం

#
స్థానభ్రష్ట న శోభంతే దంతా కేశ నఖా ద్విజా:
స్తానభ్రష్టాశ్చ శోభంతే  దంతా కేశ నఖా ద్విజా:

# వచ్చేవరకు వల్లే వేయాలి చచ్చే వరకు చదువుతూనే ఉండాలి 

తెలుగు పద్యాలు (గరికపాటి నరసింహారావు గారు)

ఈ క్రింది పద్యాలు గరికపాటి వారి నుండి వెలువడిన రసరమ్యమైన /భక్తిపూరితమైన /సామజిక చింతనా  భాషితాలు  

#1 (కంచి కామాక్షి)
అక్షులు రెండుగల్గిన మహాఫలమిప్పుడు కల్గె కంచి కామాక్షి 
జనుస్సులెన్నయినౌ భయమేమి నినుంగనంగనౌ అక్షులు 
కల్గియున్డునట్టు లానతినిమ్ము భయకరమ్ము హరియక్షము 
జీవితమ్ము ఐనా అయ్యది నిన్ దరియింప జాలుగా 

#2 (అడపిల్లలు - చీర)
పైట ఎక్కడుండే  పైపైకి జనుచుండే 
పడుచువాడి గుండె పగులుచుండే
చీరకట్టుకొండు క్షేమమ్ముగానుండు 
కూడబడకయుండు కుర్రదండు 

భాస్కర శతకం పద్యం - 2

స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికినేక్కిన వానిని ఒక్క ముష్కరుడు
అతి నీచ వాక్యములకాదని పల్కిన అమ్మహాత్ముడున్ కొఱత
వహిమ్పదయ్యెడ అకుంటిత పూర్ణ సుదాపయోధిలో
అరుగుచు కాకి రెట్ట ఇదినందున ఏమి కొఱంత భాస్కరా!

భాస్కర శతకం పద్యం - 1



సరసగుణ ప్రపూర్నునకున్ సన్నని దుర్గునముండు గల్గినన్
యిట్టు నీకు తగుయో అని చెప్పిన మాననేర్చుతాన్
బురద ఒకింత దము పొందిన చిల్లగించపైనొరసిన
నిర్మలత్వముననుండవె నీరములేల్ల భాస్కరా!