#తెలుగు భాష ఔన్నత్యం
మట్టిలో పుట్టిన మాణిక్యాల సొబగులు
సంస్కృతం నుంచి తెచ్చుకున్న తేనె పట్టు
వలసొచ్చిన పదాల వలపులు
అలవోకగా పుట్టిన జానపదాల నగవులు
అనువాదాలతో వచ్చిన అన్యదేశ్యాలు
పరిమళమై పల్లవిస్తాయి జనం నోళ్ళలో నానుతాయి
పదాల పిట్టల్లా తెలుగు నేలపై వాలి సందడి చేస్తాయి
వాడుకలో ఒదిగిన భాషాసిరులు మన తెలుగు విరులు
#
మాతృ భాషలో మాట్లాడుదాం
మమతానురాగాలు పంచుదాం
# చొక్కాపు వెంకటరమణ
వీరు తెలుగు బాల సాహిత్యానికి చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బాల సాహిత్య పురస్కారంతో గౌరవించింది
# సంతానం గురించిన చింత
(సంసార నటన - కాలకూర నారాయణరావు గారి ప్రహసనం)
కనెడు వరకు లేరు లేరనెడి చింత
కన్న తర్వాత వారి రోగముల చింత (బాలారిష్టాలు)
ఆవల అవిదేయులయి పోదురనెడి చింత
చదువులందు సర్వోన్నత స్థాన చింత
చింతయే కాదె సతతంబు సంతు వలెనా
# జాతీయం
ముక్తసరిగా మాట్లాడుతారండి
ముక్త - ముత్యం ; సరి - దండ
మాట్లాడేపుడు జాగ్రత్తగా సందర్భోచితంగా మాట్లాడితే ముక్తసరి అంటారు. అలా మాట్లాడితే మాట అందంగా ఉంటుంది, పని నెరవేరుతుంది, తగాదాలు రావు

No comments:
Post a Comment