Sunday, July 5, 2015

తెలుగు వెలుగు - 21 జూన్ 2015

# తెలుగు భాష స్థితి  
కావ్య నాటకాలకు ఆధారమైన భాష
సరస సాహిత్య్మందు రాజ్యమేలిన భాష
కవితలందు జనుల బతుకు నింపిన చారిత్రక భాష
జాతికి జీవ కర్రయై వారసత్వముగానందిన మాతృ భాష
కానీ నేడు బడుల యందు, పాలిన యందు, జనుల నాలుకల యందు సదిలి పోవుచుండె

# మనసు కవి ఆచార్య ఆత్రేయ
# కవనం అంటే కవిత్వం

# చిక్కారామదాసు 

చిక్కా రామదాసు గారు నల్లగొండ జిల్లా మరియాల వాస్తవ్యులు. వారు చిన్న వస్త్ర వ్యాపారి అయినా వారికి మాతృ భాష పై ఉన్న ప్రేమ వారిని తెలుగు సాహిత్య కళా పీఠం స్థాపించి భాషాభిమానాన్ని ప్రోత్సహించేలా చేస్తుంది.

వారి మాటలు:
- పిల్లలకు మాతృ భాష మీద మక్కువ ఏర్పడాలంటే శతకాలను పరిచయం చేయాలి .
- తెలుగుకి పట్టిన తెగులు గూర్చి వారి పద్యం
అమ్మ పదములోని కమ్మదనము పోయి పిరమిడ్ల మమ్మీలు వెలుగు జూసే
నాన్నాయనెడు మాట నాలుకనే వీడ డాడీల తూటాలు దాడి జేసె
అన్నయో తమ్ముడు యన్నగా బ్రదరాయె  చెల్లియో అక్కయో సిస్టరాయె
అత్తయిన పిన్నయిన ఆంటియె బాబాయొ మామయొ అంకులై మహిని వెలిగె
హాయ్ హలో అంచు షేకుహ్యాండు ఆటలాడ బై వెల్కమ్ ఒకేలు సీయు  యనెడి ఆంగ్లపదజాల
మీరీతి ఆక్రమింప తెలుగు భాషకు విడలేని తెగులు రగిలె

- పలకాలి తెలుగు మాట ప్రతి నోట కనబడాలి తెలుగు రాత ప్రతిచోట

# కాళ్ళ గజ్జి కంకాళమ్మ
కాళ్ళకు గజ్జి వచ్చిన సమయంలో చేసుకోవాల్సిన వైద్యాన్ని ఉక్తపదాగ్రస్త అలంకారంలో ఒక పాటగా పొందు పరిచారు 

కాళ్ళా గజ్జి కంకాళమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ
మొగ్గా కాదు మోదుగు నీరు
నీరూ కాదు నిమ్మల బావి
బావీ కాదు బచ్చల కూర
కూరా కాదు కుంకం మెట్టు
మెట్టూ కాదు మేదర ఇల్లు
ఇల్లూ కాదు ఈగల తొట్టె
తొట్టీ జరిపీ పక్కన బెట్టు
కాళ్ళూ గడిగి గట్టున పెట్టు

# సామెత
కర్ణుడితో భారతం సరి కార్తీక మాసంతో వానలు సరి

# జాతీయం
ఆయనకు కొంచెం ఫాసిజం ఎక్కువ
ఫాసిజం అంటే గర్వం, సోకు, ఆర్భాటం

# పలుకుబడి
పేనుకు పెత్తనం ఇవ్వకూడదు 





















No comments:

Post a Comment