#అక్షర వాచస్పతికి నివాళి
తెలంగాణా వ్యాసుడు, అక్షర వాచస్పతి అని పేరొందిన దాశరథి రంగాచార్య 8 జూన్ న పరమ పదించారు.
సాంప్రదాయ కుటుంబం నుండి వొచ్చిన చిన్నతనంలోనే సామాజిక పరిస్థితులను జీర్ణించుకోలేక అన్యాయాన్ని ఎదిరిస్తూ పోరాట బాట పట్టాడు. అతను తెలంగాణ సాహిత్యానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. అతని రచనలు తెలంగాణా సామాజిక జీవితాన్ని యదాతధంగా ఆవిష్కరిస్తాయి. అతను తన రచనలు చేతల ద్వారా తెలంగాణా బతుకుల్లోని జీవన శక్తిని పట్టుకున్నాడు, భాషలోని యాస సొగసుల్ని ఆవిష్కరించాడు. అనుభవానికి నిజాయితీని అద్దాడు. మానవత, ఆదర్శాన్ని రెండు కల్లుగా, సమాజ హితాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని ఒకటిగా బావించాడు. మార్క్సిజాన్ని, వేదసారాన్ని అన్వయం చేసుకున్న గొప్ప తత్వవేత్త. మట్టి బతుకుల అక్షర శిల్పి, తరతరాలకు రచనా వారధి దాశరథి

No comments:
Post a Comment