Sunday, July 26, 2015

సాహిత్యంలో హాస్యం - 234

# బ్రతికి చెడుట 
మన పరిస్థితి దిగజారి పోయినప్పుడు మనం మన స్థాయికి తగని పనులు చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో మనం స్వతాహాగా పడే బాధ కంటే ఎదుటి వారి పరామర్శ వాళ్ళ కలిగే  బాదే ఎక్కువ.

ఒకసారి ఒక పండితుడు తన స్థాయికి తగని పనిని చేయాల్సి వొచ్చింది. అది ఏంటంటే రాజు గారి పల్లకి మోయడం. తనకి అలవాటు లేని పని అవడంతో ఆ పండితుడు పల్లకి మోయడంలో ఇబ్బంది పడుతున్నాడు. అది గమనించిన రాజు జాలి పడి ఇలా అన్నాడు
                 ఆయమాందోళికా దండక
                 కక్షక్కిం తవ భాదతి 

అది వినిన ఆ పండితుడు బదులుగా
                నాయమాందోళికా దండక
                తవ భాదతి భాదతే

రాజు తప్పుగా వాడిన భాదతి అనే శబ్దం భాదించినంతగా ఈ పల్లకి ఎం భాదించడం లేదని తన ఆవేదన.

ఆందోళికా దండ - పల్లకీ కొయ్య
ఆందోళన - ఊగడం

# నానాటికి తీసికట్టు నాగంబట్టు 

                  ఏ నాటి అగ్రహారము మీనాటికి
                 కండ్రిగాయే మీ పని దీరెన్
                 మానాడు మాన్యమయ్యెను
                 నానాటికి తీసికట్టు నాగంబట్టు 

పౌరుడు - అగ్రహారం
కండ్రిగ - 100 ఎకరాలు
మాన్యం - ~ 10 నుండి 25 ఎకరాలు
భోగం - ఉత్సవం

# నవ్వు నాలుగు విధాల చేటు మరి ఏడుపో?

ఏడుపు ఏడూ విధాల మెలత
1. కళ్ళలోని క్రిములు బయటికొస్తాయి
2. హృదయభారం తేలికవుతుంది
3. ఏడ్చేవారికి గుండె నొప్పి ఉండదు (ఆడవాళ్ళకు అందుకే రాదు)
4. కళ్ళ నొప్పులు తగ్గుతాయి
5.  కళ్ళలోని 37 రకాల కండరాలు బలపడుతాయి
6. మగ, ఆడ వాళ్ళలో హార్మోన్లు ఏడుపు వల్ల పెరుగుతాయి
7. ఏడ్పు నటించడం వల్ల చాల పనులు జరుగుతాయి 












No comments:

Post a Comment