Saturday, June 27, 2015

తెలుగు వెలుగు - 7 జూన్ 2015

# తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి 

"మారుతున్న తరుణంలో మాతృ భాషకు లేదు స్థానం 
మమకారాలు దూరమవుతున్న ప్రస్తుత తరుణం
చిన్ననాడే  చిన్న చూపుతో తల్లి భాషకు దూరం 
అమ్మా నాన్నల పలకరింపులు కనుమరుగవుతున్న కలవరం 
పాడిపంటల్లో పరిణవిల్లే జానపదాలు సైతం జారిపోతున్న కాలం
పాత పదాల పదును తగ్గి పస వాడిపోతున్న వైనం 
ఆనాటి ఆటలు పాడుకున్న తెలుగు పాటలు చిన్న నాటి మాటలు 
చిగురుకైనా లేవు చింతలే తప్ప కాపాడు తత్వం కానరాదు"

# మనం తెలుసుకోవాల్సిన గోప్ప తెలుగు కవి, నవలా-కథా రచయిత పాలగుమ్మి పద్మరాజు  

# సామెతలు - జాతీయాలు 
- "కన్ను పోయేంత కాటుకవసరమా"
అలంకారం అనేది శరీర ఆరోగ్యాన్ని పాడు చేసేంత ఉండకూడదు 

- "వాళ్లదంతా బీరకాయ పీచు"
అక్క కొడుకుకి తమ్ముడి పిల్లనిస్తే మేనరికం. అదే అక్క కూతురిని తమ్ముడు కొడుక్కిస్తే ఎదురు మేనరికం. ఇలా మేనరికాలు ఎదురు మేనరికాలతో వరుసలు తేల్చుకోలేనంత బందాలు ఒక కుటుంబంలో ఉంటే బీరకాయ పీచు అంటారు   

No comments:

Post a Comment