# ప్రార్థనా శ్లోకం
మండుటెండలోన మర్రి నీడనుబోలి అభయహస్తమొకటి శుభము జూపు
అదియె లేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గూర్చి ఏడ్చువారు
# మేకపోతు గాంభీర్యం
మనకి ఎపుడైనా మనకంటే బలవంతులైన వారిచే ఆపద ఏర్పడ్డప్పుడు తెలివితేటలతో, మాటలతో తప్పించుకొనవచ్చును. దానికి ఒక జాతీయమే మేకపోతు గాంభీర్యం.
ఒకసారి ఒక మేకపోతు దారి తప్పి అడవిలోకి వెళ్ళిందట. భయపడుతూ ఉన్న ఆ మేకపోతుకి ఒక సింహం ఎదురైంది. అసలే భయపడుతూ ఉన్న ఆ మేకకి ఇక తను చావక తప్పదు అనిపించింది. కాని చనిపోయేముందు ఈ సింహం భారి నుండి తప్పించుకోడానికి తన వంతు ప్రయత్నం చేద్దాం అనుకుంది. మేకపోతుని ఎప్పుడూ చూడని సింహం, ఆ మేకపోతుకి ఉన్న గడ్డాన్ని చూసి ఇలా ప్రశ్నించింది.
"ఏంటి ఎవరు నీవు? వింతగా గడ్డం అలా పెంచావు. నా జూలు చూసావా ఎలా ఉందో". అప్పుడు ఒక మెరుపు లాంటి ఆలోచన ఆ మేకకు తట్టి ఇలా పలికింది -
"అహమేక శతం వ్యాఘ్రాం
పంచవింశతి కుంజరాన్
ఏక సింహంన భక్ష్యామి
గడ్డంతేన విముచ్యతే"
ఇప్పటి వరకు వంద పులులను చంపాను. ఇరువది అయిదు ఏనుగులను తిన్నాను. ఒక్క సింహాన్నైన తిననిదే ఈ గడ్డం తీయనని ప్రతిజ్న చేసాను. అది వినిన సింహం భయపడి పరుగో పరుగు. అద్గదీ మేకపోతు గాంభీర్యం అంటే.
- తెలివి తేటలు మనల్ని కాపాడుకోడానికి, పరులను రక్షించడానికి ఉపయోగించాలి కాని మోసం చేయడానికి కాదు
- తెలివి తేటలు పర భాషలోనే చదువుతే వస్తాయని కాదు. మాతృభాషలో అభ్యసించినా వస్తాయి. 30 ఏళ్లుగా ప్రభావితం చేస్తున్న ఆంగ్ల భాష డబ్బులు, ఉద్యోగాలు, భోగాలను ప్రోత్సహిస్తుంది.
# సూక్ష్మ దృష్టి - బొంగరం మీద (వెంకట పార్వతీశ్వరులు)
రింగు రింగున తిరుగునీ బొంగరంబు
ఏమి వ్రాయుచునున్నది ఈ ఇసుకలోన
బడికి పోలేదు పుత్తంబు పట్టలేదు
ఎట్లు వచ్చినదో దీనికింత చదువు
కవిత్వమనేది వస్తువులో ఉండదు. చూసేవాడి దృష్టిలో ఉంటుంది. కవిత్వానికి కావాల్సింది క్రాంత దర్శన. అదే సూక్ష్మ దృష్టి.
- పట్టుకోవాలని సీతాకోక చిలుక వెంబడి పడితే అది దొరకదు. అదే నువ్వు రాయిల కదలకుండా ఉండు. అదే నీ మీద వాలుతుంది. సుఖాలు కూడా అంతే. మనం వెంట పడితే పరుగెడతాయి. అదే ఏమి చేయకుంటే మన దగ్గరికే వస్తాయి

మహేందర్ గారు🙏
ReplyDeleteఎందుకు ఆపేశారు బ్లాగులను. చాలా బాగా రాస్తున్నారు. వ్రాయండి.